మెకానిక్ కుటుంబానికి అండగా మెట్ పల్లి మెకానిక్ అసోసియేషన్.

తేది:26-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన మెకానిక్ చిట్యాల సాయన్న అనారోగ్యంతో మృతి చెందడంతో, అదే వృత్తికి చెందిన సహచరులు మానవత్వాన్ని చాటుకున్నారు. మెట్‌పల్లి మెకానిక్ అసోసియేషన్ సభ్యులు కుటుంబాన్ని పరామర్శించి, వారి దుఃఖంలోభాగస్వాములయ్యారు.
కష్టకాలంలో అండగా నిలుస్తూ రూ.25,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. “మన వృత్తి మన బంధం” అన్న భావనతో ముందుకు వచ్చిన మెకానిక్‌లు, సహచరుడి కుటుంబానికి తోడుగా నిలవడం స్థానికంగా ప్రశంసలు అందుకుంది.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు భూస రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు సమ్మన్న, క్యాషియర్ హరీష్, సభ్యులు సురేష్, బాబా, ఎస్.కే. మజార్, ఎం. సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *