పోలీస్ శాఖలో ప్రమోషన్ల అంశంపై అసెంబ్లీలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు ప్రసంగించారు.

తేది:26-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: ప్రమోషన్ల విషయంలో మల్టీజోన్-1, జోన్-2 వల్ల హైదరాబాద్, సైబరాబాద్ రేంజ్లో ఉన్నవారికి వేకెన్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా ప్రమోషన్లు వస్తాయని, వీరు డిఎస్పీలు, సీఐలు కాగానే సేమ్ బ్యాచ్ లో ఉన్న వారు సెల్యూట్ కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, గతంలో తన పోలీస్ శాఖలో పనిచేశానని, ఈ అంశంపై గతంలో మాజీ ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశామని, ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలిసి కూడా వినతిపత్రం అందజేశామని, ట్రైనింగ్ నుండే సీనియార్టీని ఫిక్స్ అప్ చేస్తే, మహారాష్ట్ర, చెన్నై లాగా తీసుకొని ప్రమోషన్ చూస్తే బాగుంటుందని, ఈ అంశం యొక్క ఫైల్ పెండింగ్లో ఉందని, వెంటనే అంశంపై తీసుకోవాలన్నారు.
ఏఆర్ నుంచి సివిల్‌కు కన్వర్షన్ అయ్యే కానిస్టేబుళ్ల అంశం 2017 నుంచి పెండింగ్ ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *