ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 20 మంది సజీవ దహనం, మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం..

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలకల క్వారీల వద్ద టిప్పర్ ను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్పాట్ లో 20 మంది సజీవదహనమయ్యారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

 

మర్కాపురం జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం

 

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వారీల వద్ద ట్రావెల్స్ బస్సు.. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. వెంటనే మంటలు బస్సుని చుట్టుముట్టాయి. అప్పటికి ప్రయాణికులు నిద్రలో ఉన్నారు.

 

ప్రయాణికులు తేరుకునే లోపు 20 మంది సజీవ దహనమయ్యారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లా పామూరు ట్రావెల్ బస్సు వెళ్తోంది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 40 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్నారు పోలీసులు. మరో 23 మంది గాయపడ్డారు.

 

టిప్పర్‌ని ఢీ కొన్న ట్రావెల్ బస్సు.. 10 మంది ప్రయాణికులు సజీవ దహనం

 

వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈలోగా సమీపంలోని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది. గురువారం ఉదయం 6 నుంచి 6.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లా ఉదయగిరికి వెళ్తోంది ఈ ట్రావెల్ బస్సు.

 

ప్రమాదంలో బస్సు పూర్తిగా దహనం కావడంతో ఏ ట్రావెల్‌కి చెందినది అనేది స్పష్టత రాలేదు. ప్రమాదానికి ముందు మార్కాపురంలో కొంతమంది ప్రయాణికులు దిగిపోయారు. మార్కాపురం దాటిన బస్సు మూడు కిలోమీటర్లు వెళ్లగానే ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 10 మంది ప్రయాణికులు బయటపడ్డారని సమాచారం. లోపల 10 నుంచి 20 మంది ప్రయాణికులు ఉండవచ్చని ఓ అంచనా. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *