తేది:25-03- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
మెదక్ జిల్లా : ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామంలో ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటి, ప్రతిష్టాత్మకమైన గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థులను ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికైన వారిలో ఈ కింది విద్యార్థులు ఉన్నారు శ్రీకృతి,మాధుశ్రీ,సాకేత్,స్నేహ,ఓవన్,పృథ్విరాజ్,ఋషివర్ధన్,
ఈ విజయోత్సవ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు గ్రామ ప్రముఖులు పాల్గొని విద్యార్థులను అభినందించారు:
బి. శివచందర్ ప్రధానోపాధ్యాయులు,కె. ఉజ్వల సహోపాధ్యాయురాలు సనా ఫాతిమా: ఉర్దూ ఉపాధ్యాయురాలు అరుణ నరేందర్ రెడ్డి: గ్రామ సర్పంచ్
నరేందర్ రెడ్డి: మాజీ ఎం.పి.టి.సి అన్వార్ పాటిల్: గ్రామ విద్యార్థుల కష్టానికి, ఉపాధ్యాయుల బోధనకు తోడు గ్రామ పెద్దల సహకారం ఉండటం వల్లే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇటువంటి విజయాలు సాధిస్తున్నారని సర్పంచ్ మరియు ఉపాధ్యాయ బృందం కొనియాడారు.