తేది: 25-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ అధికారులు కీలక సూచనలు చేశారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ, రాంగ్‌రూట్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు.
డయల్-100 కాల్స్‌కు తక్షణ స్పందన ఇవ్వాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసి నేరాలను అరికట్టాలని ఆదేశించారు.
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రశంసిస్తూ, ప్రశంస పత్రాలు మరియు నగదు బహుమతులతో సత్కరించారు.