తేది: 24-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా: ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో “టిబి ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిబి నిర్ధారణకు సంబంధించిన అవగాహన పోస్టర్‌ను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్, మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తో పాటు ఇతర అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. టిబి వ్యాధిని సమయానికి గుర్తించడం ద్వారా పూర్తి స్థాయిలో నయం చేసుకోవచ్చని వారు పేర్కొన్నారు.
ప్రజలు దగ్గు, జ్వరం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు.
టిబి నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు రావాలని అధికారులు పిలుపునిచ్చారు.