వార్డు మెంబర్లకు ఐదు రోజుల ఓరియెంటేషన్ శిక్షణ ప్రారంభం.

తేది:23-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు 5 రోజుల ఓరియెంటేషన్ శిక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంపిడిఓ రామకృష్ణ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ చట్టంలోని విధివిధానాలు, బాధ్యతలపై ప్రతి వార్డు మెంబర్‌కు అవగాహన ఉండాలని, ఐదు రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు రాకేష్, రమేష్, రాజశేఖర్, రవి శిక్షణ అందించనున్నారు. మొదటి బ్యాచ్‌లో అమ్మకపేట, ఎర్రాపూర్, డబ్బా, వర్షాకొండ, కోమటి కొండాపూర్, కేశాపూర్, కోజన్ కొత్తూరు, ఇబ్రహీంపట్నం గ్రామాలకు చెందిన 79 మంది వార్డు మెంబర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *