తేది:23-03-2026 TSLAWNEWS
జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: జీవిత ప్రయాణంలో ఎవరు ఎక్కడికి వెళ్లినా, కాలం ఎంత దూరం తీసుకెళ్లినా, బాల్య స్నేహం మాత్రం చెదరదని ఈ ఆత్మీయ సమ్మేళనం నిరూపించింది. మల్యాల ZPHS పాఠశాలలో 1971- 72 సంవత్సరంలో 10వ తరగతి చదివిన వారంతా 56 ఏళ్ల తర్వాత కలిశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని ఆనాడు పాఠశాలలో చేసిన అల్లరి, అనుభూతులు అన్నీ స్మరించుకున్నారు. ఎన్నోఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ స్నేహసమ్మేళనం జీవితాంతం నిలిచిపోయే మధుర జ్ఞాపకంగా వారికి మారింది.