తేది:23-03-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.
జగిత్యాల జిల్లా: మల్యాల మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన దివ్యాంగురాలు ఖాసీంబి (23)కి పింఛన్ అందేలా చూడాలని వార్డు సభ్యురాలు గాండ్ల జ్యోతివేణు సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మతిస్థిమితం సరిగా లేని సదర్ యువతికి 100% అధికారిక వైకల్య ధ్రువపత్రం ఉన్నా, పింఛన్ అందడం లేదని కలెక్టర్కు విన్నవించారు. అలాగే, గ్రామంలో వివిధ రకాల పింఛన్లు చాలా వరకు పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.