తేది: 23-03-2026 TSLAW NEWS నల్గొండ ఇంచార్జ్ కానుగుల స్వామి.
నల్లగొండ పట్టణంలో “నో హెల్మెట్ – నో డ్రైవింగ్” పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు.
హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం – ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవు.
నల్గొండ జిల్లా: నల్లగొండ పట్టణంలో రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పట్టణ ట్రాఫిక్ పోలీసులు “నో హెల్మెట్ – నో డ్రైవింగ్” పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మరియు రద్దీ ప్రాంతాలలో వాహనదారులను తనిఖీ చేసి, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ పట్టుబడిన వాహనదారులకు హెల్మెట్ వినియోగం పైన అవగాహనా కల్పిస్తూ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు అత్యంత అవసరమని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రమాద సమయంలో తలకు గాయాలు కాకుండా రక్షణ కల్పించేది హెల్మెట్ మాత్రమే అని పేర్కొన్నారు.
అదేవిధంగా, హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపే వారిపై జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ, తమ ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని పట్టణ పోలీసులు కోరారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.