తేది:23-03-2026హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు సరైన మద్దతు ధర కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు సూచించారు.హన్మకొండ జిల్లా హసన్పర్తి, ఐనవోలు మండలాల పరిధిలోని ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS)లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు హన్మకొండ మార్క్‌ఫెడ్ డీఎం శ్యామ్ తో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.రైతులు తమ పంటను సరైన ధరకు విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.