తేది:22-03-2026హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పరిధిలోని పర్వతగిరి గ్రామ పంచాయతీ పరిధిలో దేవిలాల్ తండాకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు లావుడ్య మంగమ్మ – రాములు ఇంటి నిర్మాణం కోస ముగ్గుపోసే కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలియజేశారు.ఇందిరమ్మ ఇండ్లు కట్టుకో లేని వారి కోసం ఒక కంపెనీ తో మాట్లాడను ఇండ్లు మంజూరైన ప్రతి ఒకరు ఇండ్లు కట్టుకొని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు..పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. లబ్ధిదారులకు విడుదలవారీగా రూ 5లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు.అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు.ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని అన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవని, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇండ్లను నిర్మించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి గ్రామ సర్పంచ్ చిదురు శంకర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కూసం రామచందర్, మండల పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.