రాజీనామాపై కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. 2026, మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

తేది :22-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు..

జగిత్యాల జిల్లా కేంద్రం లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పత్రిక సమావేశంలో నాలుగు దశాబ్దాలకుపైగా నాతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు.. గత 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను మీరు గమనిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇంకనూ అవమానాలకు గురి అవుతూ, మానసిక క్షోభతో, కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యంకాని పరిస్థితులలో 2026, మార్చి 25 రోజున భవిష్యత్ ప్రణాళిక కోసం జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్డు బండారి గార్డెన్‎లో ఉదయం 10:00 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, మీ సలహాలు, సూచనలతో, భవిష్యత్, రాజకీయ ప్రస్థానంలో మీ తోడు, అందదండలతో, వాకు మానసిక స్థైర్యం కలిగిస్తు, మార్గదర్శకం కాగలరని మనవి” అని లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *