తేది:21-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో రంజాన్ వేడుకలు జరుపుకున్న- ఏఐఎంఐఎం పార్టీ సదాశివపేట పట్టణ అధ్యక్షులు ఎండి గౌస్ పాషా.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఏఐఎంఐఎం పార్టీ కార్యాలయంలో రంజాన్ పండుగ వేడుకలను ఏర్పాటుచేసిన ఏఐఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి గౌస్ పాషా. సదాశివపేట పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను మరియు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారికి రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానం పలికిన ఏఐఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి గౌస్ పాషా. ఇట్టి తరుణంలో పవిత్ర రంజాన్ పండుగను పునస్కరించుకొని న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో నెలరోజుల పాటు ఉపవాసం ఉండి రంజాన్ పండుగ వేడుకలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులను మరియు సదాశివపేట పట్టణ ప్రజలను రాజకీయాలకు అతీతంగా సోదరా భావంతో ఆహ్వానించి రంజాన్ వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముస్లిం సోదరి, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు పేరుపేరునా తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు సకినాల కృష్ణ, జగత్ కృష్ణ, చిరంజీవి గౌడ్, కుషాల్ గౌడ్, వీరేశం, లింగం, రాము, భీమన్న, సంతోష్ కుమార్, మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.