తేది:21-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.
వరంగల్ జిల్లా: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ మాసం ఆత్మపరిశుద్ధికి, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉపవాస దీక్షలు మనసుకు నియంత్రణను, జీవనంలో క్రమశిక్షణను అందించడంతో పాటు, సమాజంపై సేవా దృక్పథాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈద్-ఉల్-ఫితర్ పండుగ ఉపవాస దీక్షల అనంతరం ఆనందాన్ని పంచుకునే పవిత్ర వేడుకగా భావించబడుతుందని తెలిపారు.సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవాన్ని పెంపొందించడంలో రంజాన్ ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో వివిధ మతాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించడం రాష్ట్ర గొప్ప సంప్రదాయమని, ఈ సంస్కృతి మరింత బలపడాలని ఆకాంక్షించారు.అల్లా దయతో రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆరోగ్యం, అభివృద్ధి కలగాలని ప్రార్థించారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సమాజానికి శాంతి, శ్రేయస్సు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరోసారి వర్ధన్నపేట నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.