తేది:21-03-2026 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 19వ డివిజన్ కాశీబుగ్గలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి హరి హర పుత్ర అయ్యప్పస్వామి దేవాలయం అభివృద్ధికి ముఖ్యమైన అడుగు పడింది. జిడబ్ల్యూఎంసీ జనరల్ నిధుల నుండి మంజూరైన రూ.29.70 లక్షలతో చేపట్టనున్న గ్రానైట్ ఫ్లోరింగ్ పనులకు తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.
ఇటీవల ఏర్పాటు చేసిన ఆలయ నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. రాబోయే శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి కోరారు.
నూతన ధర్మకర్తలుగా భూక్య మోతిలాల్, వెలిశాల మధుమతి, పోతన లక్ష్మి నరసయ్య, కుడికాల కోటి, లకుం భాస్కర్ నియామకాన్ని మంత్రి అభినందించారు. కమిటీ ఏర్పడిన రోజే సుమారు రూ.30 లక్షల నిధులు విడుదల కావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయం మరింత అభివృద్ధి చెందాలని స్థానికులు, భక్తులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొందరు గుడిలో ఆధిపత్యం కోల్పోతున్నారనే కారణంతో అంతరాయం కలిగించే ప్రయత్నం చేసినా, పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించారు. అనంతరం కార్యక్రమం సజావుగా కొనసాగగా, వచ్చిన భక్తులందరూ సంతృప్తిగా వెళ్లిపోయారు.
ఇప్పటికైనా వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి ఆలయ అభివృద్ధికి నూతన కమిటీకి సహకరించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్, స్థానిక కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్, మాజీ కార్పొరేటర్లు, 19వ డివిజన్ అధ్యక్షుడు రాజేష్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ సిలివేరు రాజు, కాంగ్రెస్ నాయకులు మీసాల ప్రకాశ్, గుజ్జుల రాకేష్ రెడ్డి, రవి, జగన్ తదితరులు, ఆలయ నూతన ధర్మకర్తలు పాల్గొన్నారు.