మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బుజ్జగింపులు షురూ.. ఆ 10మంది MLA లను పార్టీ వ్యవహారాలకు దూరం ఉంచుతాం అని చెప్పిన మంత్రులు.

తేది:21-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్న మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
జీవన్ రెడ్డితో ముచ్చటిస్తున్న మంత్రులు, నాయకులు
మీడియాను లోపలికి అనుమతించకుండా మంత్రుల రహస్య చర్చలు జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఆయన నివాసానికి చేరుకుని కీలక చర్చలు జరిపారు.
శనివారం ఉదయం మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మరియు కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
జీవన్ రెడ్డితో కలిసి అల్పాహారం చేస్తూ మంత్రులు, నాయకులు కొంతసేపు ముచ్చటించినట్లు సమాచారం. పార్టీ పరిణామాలు, జగిత్యాల రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *