తేది:19-03-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండల కేద్రం లో ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మండల అధ్యక్షుడు హనుమంతరావు పటిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విందు, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పాల్గొనడంతో గ్రామంలో మత సామరస్యానికి అద్దం పట్టింది.
ఈ వేడుకకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఉదయ శంకర్ పటేల్,వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు.
మండల స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు. పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సాయంత్రం నమాజ్ అనంతరం ముస్లిం సోదరులతో కలిసి నాయకులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు సోదరభావానికి చిహ్నమని కొనియాడారు.రాజకీయాలకు అతీతంగా, కేవలం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ విందులో వందలాది మంది పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరినీ ఏకం చేస్తున్న హనుమంతరావు పాటిల్ ను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు.