శ్రీలీల సీరియస్ లుక్ వెనుక అసలు కథ: రంగస్థలం మహేష్‌పై కోపం కాదు.. అది కేవలం మిస్ కమ్యూనికేషన్!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా, శ్రీలీల వెనక్కి తిరిగి రంగస్థలం మహేష్‌ను సీరియస్‌గా చూసినట్లు ఉన్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై తాజాగా ఆమె క్లారిటీ ఇస్తూ.. అది కేవలం ఒక పొరపాటని పేర్కొన్నారు. ఆ సమయంలో వేదికపై వెనుక నుంచి ఏదో శబ్దం రావడంతో తాను అటువైపు చూశానని, అదే సమయంలో తన ఫోన్ మహేష్ దగ్గర ఉండటంతో ఆయన తాను ఫోన్ కోసమే చూస్తున్నానని అనుకుని నవ్వారని శ్రీలీల వివరించారు. అక్కడ ఎలాంటి గొడవ లేదా అగౌరవం జరగలేదని ఆమె స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో ఈ చిన్న క్లిప్పింగ్‌ను ‘మిస్ బిహేవ్’ లేదా ‘సీరియస్ లుక్’ అని పెద్ద పదాలతో వైరల్ చేయడం పట్ల శ్రీలీల విచారం వ్యక్తం చేశారు. “నాకు ఎవరిపైనా కోపం లేదు, అది కేవలం ఒక మిస్ కమ్యూనికేషన్ మాత్రమే” అని ఆమె అన్నారు. రంగస్థలం మహేష్‌తో తాను సినిమాలో చాలా సీన్లలో నటించానని, ఆయన పట్ల తనకు ఎలాంటి అసహనం లేదని చెప్పారు. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు తనకే బాధ అనిపించిందని, ఎవరైనా స్వయంగా చెబితే తప్ప ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని ప్రేక్షకులను కోరారు.

మరోవైపు రంగస్థలం మహేష్ కూడా ఈ విషయంపై ఇప్పటికే స్పందించారు. శ్రీలీల స్టేజ్ ఎక్కేటప్పుడు తనకు సహాయం చేశానని, ఆమె ఫోన్ తన వద్దే ఉందని ఆయన తెలిపారు. ఆమె వెనక్కి తిరిగినప్పుడు ఫోన్ అడుగుతున్నారేమో అనుకుని తాను నవ్వానని, అంతకు మించి అక్కడ ఏమీ జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం రేపు (గురువారం) భారీ స్థాయిలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *