తేది:17-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: ఈరోజు నర్సక్కపల్లె గ్రామాన్ని గౌరవ హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ అకస్మాత్తుగా సందర్శించి గ్రామ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ గారు, రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు మరియు అవసరాలను తెలుసుకున్నారు. అందులో భాగంగా, గ్రామంలో మిర్చి పంటను అత్యధికంగా పండించి ఆదర్శ రైతుగా నిలిచిన కోడెపాక దేవేందర్ గారిని కలెక్టర్ గారు ప్రత్యేకంగా అభినందించారు. వారి కృషి, పట్టుదల మరియు నూతన వ్యవసాయ పద్ధతులను ప్రశంసిస్తూ, ఇతర రైతులకు కూడా ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు.
ఈ సందర్శనతో గ్రామ రైతులకు మరింత ప్రోత్సాహం లభించగా, ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ గారు తెలిపారు.