తేది:16-03-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ నియోజకవర్గ రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.
వికారాబాద్ జిల్లా:వికారాబాద్ మండలంలో శిక్షణ ఫౌండేషన్ విద్యాశాఖ వికారాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించిన మండల స్థాయి క్విజ్ కాంపిటీషన్లో ప్రథమ బహుమతి ప్రాథమిక పాఠశాల మదనపల్లి ,ద్వితీయ బహుమతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వికారాబాద్, తృతీయ బహుమతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొటాలగూడ సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బాబు సింగ్ , గారు శిక్షణ ఫౌండేషన్ డిస్టిక్ మేనేజర్ నాగరాజు, మెంటర్స్ లక్ష్మీనారాయణ, పార్వతి వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండల విద్యాధికారి గారు మాట్లాడుతూ శిక్షణ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుందని వారి సేవలు వర్ణనాతీతం అని కొనియాడారు.