అల్లీపూర్ గ్రామంలో ఘనంగా వారసంత ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీఓ సుష్మ పారిశుధ్య కార్మికులకు సన్మానం,

తేది:15-03-26 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వారసంతను వైభవంగా ప్రారంభించారు. సర్పంచ్ ఎంబారి గౌతమి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధికారి (ఎంపీఓ) సుష్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కచేరి నుంచి జెండా వరకు ఏర్పాటు చేసిన ఈ వారసంతను ఆమె రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులను ఎంపీఓ సుష్మ ఘనంగా సన్మానించారు. వారికి శాలువాలు కప్పి, శానిటేషన్ సంబంధించిన వస్తు సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో పారిశుధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినయ్ కుమార్, 8వ వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్ కుమార్, కారోబార్ రాజేందర్, వార్డు సభ్యులు వనిత, రోజా, సంధ్య, నాగభూషణం, భూమయ్య, మల్లేశం, రాజేందర్, మనీష్, రచన సురేష్, రాజు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *