తేది:15-03-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం మేధాపల్లి గ్రామంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సర్పంచ్ అరుణ,ఉప సర్పంచ్ మజార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సోదరభావాన్ని చాటుకున్నారు.
కులమతాలకు అతీతంగా గ్రామంలోని ముస్లిం సోదరులతో కలిసి హిందూ, ఇతర సామాజిక వర్గాల వారు ఈ విందులో పాల్గొన్నారు.
ఉపవాస దీక్షల ప్రాముఖ్యతను వివరిస్తూ, గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
గ్రామ ఉప సర్పంచ్ మజార్ స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అతిథులందరికీ రంజాన్ పలహారాలు మరియు విందు భోజనాన్ని వడ్డించారు.
కార్యక్రమ వివరణ: సాయంత్రం ఉపవాస విరమణ సమయంలో మసీదు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ విందులో గ్రామ పెద్దలు, యువకులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మజార్ మాట్లాడుతూ పండుగలు మన మధ్య ప్రేమను, ఐకమత్యాన్ని పెంచుతాయని, మేధాపల్లి గ్రామం ఎప్పుడూ ఇలాగే కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించారు.
గ్రామస్తులు అందరూ ఒకే చోట కూర్చుని విందును ఆరగించడం చూస్తుంటే గ్రామంలో ఉన్న మత సామరస్యం ప్రతిబింబించిందని పలువురు ప్రశంసించారు.కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిలాష్ రెడ్డి యూవ నాయకులు ఖైరోద్దీన్ ముజీబ్ అబ్దుల్ రెహమాన్ రియాజ్ పటేల్ చోటు పటేల్ తదితరులు పాల్గొన్నారు.