చిలపల్లిలో ఘనంగా ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక.

తేది:14-03-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా: ​ఝరాసంగం మండలం చిలపల్లి గ్రామంలో ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మాజీ ఎంపీటీసీ ఆఫిజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పండుగ జరుపుకోవడం ద్వారా ఈ వేడుక గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
​ముఖ్య అతిథులు గా పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, హనుమంతరావు పటిల్ మరియు చిలపల్లి సర్పంచ్ మాలరెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్ లు పార్టీ ముఖ్య నాయకులు విచ్చేశారు. వారితో పాటు
​నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు.మరియు ఇతర ప్రజా ప్రతినిధులు.పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు.సాయంత్రం నమాజ్ అనంతరం ముస్లిం సోదరులతో కలిసి నాయకులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు సోదరభావానికి చిహ్నమని కొనియాడారు. మాజీ ఎంపీటీసీ ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ అందరినీ ఏకం చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
​రాజకీయాలకు అతీతంగా, కేవలం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ విందులో వందలాది మంది పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *