జోయాలుక్కాస్ గోల్డ్ షోరూంను ప్రారంభించిన మంత్రి సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు.

తేది:12-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: హన్మకొండ నక్కలగుట్ట లో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు తొలుత రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి షో రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యాజమాన్యం ఎమ్మెల్యే నాగరాజు శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం షోరూం లో నిర్వహించిన ఫ్యాషన్ షో ను తిలకించిన ఎమ్మెల్యే నాగరాజు నిర్వాహకులకు మరియు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *