రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖుల గురించి తన మనసులోని అభిప్రాయాలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుండబద్ధలు కొట్టారు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. వివిధ పార్టీల నేతలను ఒక్కో పదంతో అభివర్ణించారు. ముఖ్యంగా గతంలో రాజకీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడుపై ఆమె ప్రశంసలు కురిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

కవిత దృష్టిలో నాయకులు:

  • కేసీఆర్: గొప్ప ఉద్యమ నాయకుడు.

  • నారా చంద్రబాబు నాయుడు: ఈ వయసులో అద్భుతమైన పట్టుదలతో మళ్లీ సీఎం అయ్యేవరకూ కొట్లాడారు, గ్రేట్.

  • వైఎస్ జగన్: గట్టి లీడర్.

  • రేవంత్ రెడ్డి: ఫ్లాప్ సీఎం.

  • పవన్ కళ్యాణ్: నాన్ సీరియస్ పర్సన్.

  • వైఎస్ షర్మిల: ఏపీకి సీఎం కావాలని కోరుకుంటున్నా.

  • నారా లోకేష్: నా లెక్కన ఇంకా నేర్చుకుంటున్నాడు.

  • కల్వకుంట్ల కవిత: ఫ్యూచర్ సీఎం ఆఫ్ తెలంగాణ.

బీఆర్ఎస్ మరియు టీడీపీల మధ్య రాజకీయ వైరం ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు పోరాట పటిమను కవిత మెచ్చుకోవడం విశేషం. అలాగే వైఎస్ జగన్‌ను ‘గట్టి లీడర్’ అని, వైఎస్సార్‌ను ‘గుడ్ లీడర్’ అని కొనియాడారు. ప్రత్యర్థి పార్టీల నేతలైన బండి సంజయ్ గురించి మాట్లాడుతూ “అన్నను గెలవనివ్వరు, ఏమీ చేయనివ్వరు” అని, ధర్మపురి అరవింద్‌ను “అబద్ధానికి ప్రతిరూపం” అని ఘాటుగా విమర్శించారు. ఈటెల రాజేందర్‌ను మాత్రం ‘గట్టి ఫైటర్’గా గుర్తించారు.

తెలంగాణ రాజకీయ భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేస్తూ తనను తాను ‘తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి’గా అభివర్ణించుకోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా సీరియస్ లేని వ్యక్తిగా కొట్టిపారేసిన కవిత, తన సోదరి వంటి షర్మిల ఏపీ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *