కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా ప్రేమకథ: తండ్రి అభ్యంతరం – పోలీస్ స్టేషన్‌కు చేరిన వివాదం

గత ఏడాది కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ తన అందంతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిన ‘వైరల్ గర్ల్’ మోనాలిసా భోంస్లే మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె తన ప్రేమ వ్యవహారం కారణంగా కేరళలోని తిరువనంతపురం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం సంచలనం రేపింది. ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని తాను ప్రేమిస్తున్నానని, అయితే తమ వివాహానికి తండ్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రాణహాని కలిగిస్తున్నారని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా, కేరళలో జరిగిన ఒక సినిమా షూటింగ్ మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాల సమయంలో ఫర్మాన్ ఖాన్‌తో పరిచయం పెంచుకుంది. వీరిద్దరిది వేర్వేరు మతాలు కావడంతో మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే ఈ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తన కుమార్తెను బలవంతంగా తీసుకువెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా, రక్షణ కోరుతూ ఆమె తంపనూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తమకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని, ఇంటి నుంచి ముప్పు ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఈ కేసును విచారించిన పోలీసులు మోనాలిసా తండ్రిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మోనాలిసాకు 18 ఏళ్లు నిండాయని, ఆమె మేజర్ కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం తనకిష్టమైన వ్యక్తితో జీవించే పూర్తి హక్కు ఆమెకు ఉందని స్పష్టం చేశారు. ఆమె ఇష్టానుసారం జీవించడానికి అనుమతినిస్తూ, ఆమెకు మరియు ఆమె ప్రియుడికి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కుంభమేళాలో సామాన్య అమ్మాయిగా కనిపించి అందరి మనసు గెలుచుకున్న మోనాలిసా, ఇప్పుడు తన ప్రేమ కోసం చేసిన పోరాటం నెట్టింట వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *