తేది:10-03-2026 TSLAWNEWS నిజామాబాద్ జిల్లా,బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ కేశపురం సుమన్.
నిజామాబాద్ జిల్లా: వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ పరిపూర్ణ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ద్వాదశ బ్రహ్మోత్సవ కుంభాభిషేక సమాహ్వాన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీపరిపూర్ణ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం,రథ హోమం,రథోత్సవం,జాతర,మహా పూర్ణాహుతి ధ్వజారోహణ,చక్రతీర్థం,ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపారు.అలాగే ఆలయం ప్రతిష్టాపన చేసి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా వెంకటేశ్వర స్వామి వారికి కుంభాభిషేకం అత్యంత వైభవోపేతంగా జరిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పవన్ శర్మ,భార్గవ్,ఆలయ కమిటీ సభ్యులు ఏనుగు మహిపాల్,దనరెక్కులగంగాధర్,నరేష్,నారాయణ,రమేష్,కార్తిక్, గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.