వికారాబాద్‌లో శిక్షణా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు.

తేది:10-03-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ నియోజక వర్గ రిపోర్టర్ లక్ష్మీనారాయణ.

వికారాబాద్ జిల్లా:వికారాబాద్ మండలం కొత్తగడి కాంప్లెక్స్ పరిధిలోని తొమ్మిది ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు శిక్షణా ఫౌండేషన్ సంస్థ మరియు విద్యాశాఖ వికారాబాద్ జిల్లా సంయుక్తంగా క్విజ్ పోటీలను నిర్వహించాయి. ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలంపల్లి ఉర్దూ మీడియంలో జరిగింది.
ఈ పోటీలలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలలో ప్రథమ బహుమతి – మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మదనమల్లి ద్వితీయ బహుమతి – ప్రాథమికోన్నత పాఠశాల పీలారం తృతీయ బహుమతి – మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తగడి
పాఠశాలలు గెలుచుకున్నాయి.
ఈ కార్యక్రమానికి వికారాబాద్ మండల విద్యాధికారి బాబూ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులలో పోటీ తత్వాన్ని పెంపొందించడానికి మరియు సృజనాత్మకతను వెలికితీయడానికి ఇటువంటి క్విజ్ పోటీలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల FLN (Foundational Literacy and Numeracy) సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో శిక్షణా ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో శిక్షణా ఫౌండేషన్ మెంటర్స్ మరియు సీనియర్ మెంటర్స్ తుల్జప్ప, రాజేందర్, పార్వతి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *