తేది:10-03-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: న్యూఢిల్లీలో మల్లికార్జున ఖర్గే గారిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీ సీనియర్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణను ఏఐసీసీ అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తో కలిసి ఎర్రబెల్లి స్వర్ణ గారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. తెలంగాణలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.