మెదక్ జిల్లా పోలీస్ వార్షిక క్రీడోత్సవాలు ప్రారంభం.

తేది:10-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్: మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, IPS గారు పోలీస్ వార్షిక క్రీడోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు పోలీస్ పరేడ్‌ను పరిశీలించి క్రీడా జ్యోతిని వెలిగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా విధుల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండేందుకు ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు.
జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడోత్సవాలకు ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *