తేది:10-03-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ సార సురేష్.
మెదక్ జిల్లా: పాపన్నపేట మండలం ఏడుపాయల సమీపంలోని నాగ్సాన్‌పల్లి గ్రామ శివారులో ఉన్న చెల్మకుంట వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు కుంట సమీపంలో మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే మెదక్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఒంటిపై వంకాయ రంగు చీర ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహం కొన్ని రోజులుగా అక్కడ పడివున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది.
మృతురాలి గుర్తింపుపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మహిళ కనిపించకుండా పోయిందా అనే దానిపై కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఈ మహిళను ఎవరైనా గుర్తించగలిగితే లేదా ఆమెకు సంబంధించిన సమాచారం ఉన్నవారు మెదక్ రూరల్ సీఐ ఫోన్: 8712657916, పాపన్నపేట ఎస్సై ఫోన్: 8712657920 నంబర్లకు సంప్రదించాలని పోలీసులు తేలిపారు.