మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం.

తేది:09-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.

వరంగల్ జిల్లా: UGD నిధుల మంజూరుపై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ సంబరాలు. ఓరుగల్లు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం. మామునూరు ఎయిర్‌పోర్టు కోసం భూ సేకరణ పూర్తి చేసి ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అందజేశాము. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని కేంద్రాన్ని కోరాం. మామునూరు ఎయిర్‌పోర్టు, కోచ్ ఫ్యాక్టరీ పూర్తైతే స్థానిక యువతకు అధిక ఉద్యోగ అవకాశాలు. ఓరుగల్లును విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై కొందరు కావాలనే విమర్శలు. వర్షాకాలం నాటికి వరంగల్ నగరంలో వరద సమస్యలు నివారించేందుకు ప్రత్యేక చర్యలు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నాలాపై ఫామ్ హౌస్ నిర్మాణంపై అధికారులు స్పందించాలని డిమాండ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ₹5257.20 కోట్లు భారీ నిధులు మంజూరు చేసిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు.వరంగల్ ట్రై సిటీస్ (వరంగల్, హనుమకొండ, కాజీపేట) అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ₹5257.20 కోట్లు భారీ నిధులు కేటాయించడంపై, హనుమకొండ DCC ఆఫీస్ లో హన్మకొండ డిసిసి అధ్యక్షుడు,KUDA చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ సుధారాణి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అనంతరం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ₹5257.20 కోట్లు విడుదల చేసిన సందర్భంగా నాయకులు కార్యకర్తలు కలిసి బాణాసంచా పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఎన్నికల సమయంలో ఓరుగల్లు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ఓరుగల్లు ప్రజల ఎన్నో సంవత్సరాల కల అయిన మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూ సేకరణ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధి పనులు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం చేపడుతోందని, ఓరుగల్లును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ ఓరుగల్లులో అభివృద్ధి పనులు కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామని చెప్పినా అవి అమలు కాలేదని విమర్శించారు. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రైల్వే శాఖ అధికారులను, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మామునూరు ఎయిర్‌పోర్టు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పూర్తి అయితే ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, తద్వారా ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై కొందరు నాయకులు కావాలనే విమర్శలు చేస్తున్నారని, తాము ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. అలాగే వచ్చే వర్షాకాలం నాటికి వరంగల్ నగరంలో వరదల కారణంగా కాలనీలు మునిగిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నాలాపై ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపిస్తూ, ఈ అంశంపై అధికారులు ఎందుకు స్పందించలేదో తెలియదన్నారు. ఈ విషయాన్ని అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు కోరారు. మొత్తంగా ఓరుగల్లును విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని, అభివృద్ధి కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే నాగరాజు కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల డివిజన్ స్థాయి నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *