తేది: 09-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ నేడు హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజుకి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు ఎర్రబెల్లి స్వర్ణ గారికి పూల మొక్కను అందజేసి మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీ కెఆర్ దిలీప్ రాజు సతీమణి కేఆర్ సౌమ్య ఎర్రబెల్లి స్వర్ణ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.మహిళల సాధికారతకు ఆమె నాయకత్వంలో మరింత బలోపేతం కలగాలని ఆకాంక్షించారు.