ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూముల్లోని ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారీ నిరసన చేపట్టారు. బాధితులకు అండగా నిలిచిన ఆమె, సోమవారం మధ్యాహ్నం ఖమ్మం నడిరోడ్డుపై అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించారు. కూల్చివేతలకు గురైన నిరుపేదలకు అక్కడే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటి వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. కవిత నిరసనతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ సందర్భంగా కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదవాడి ఇళ్లను కూల్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. బడా బాబుల అక్రమ నిర్మాణాలను వదిలేసి, అమాయక ప్రజల గూడును చెడగొట్టడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి బాధితులకు హామీ ఇచ్చే వరకు తాను అక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. దీంతో సుమారు రెండు గంటల పాటు ఖమ్మం నగరంలో హైడ్రామా కొనసాగింది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి కవితను మరియు ఆమె అనుచరులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ గందరగోళంలో ఒక మహిళా కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోవడంతో ఉద్రిక్తత