తేది:09-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి మరణం పట్ల వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం తీసుకొచ్చి, గంగదేవిపల్లి గ్రామాన్ని దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి చేయడంలో రాజమౌళి గారు కీలక పాత్ర పోషించారని ఎంపీ పేర్కొన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ, విద్య, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు వంటి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, మేధావులు గంగదేవిపల్లిని సందర్శించి గ్రామాభివృద్ధి నమూనాను అధ్యయనం చేసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత కూసం రాజమౌళిదేనని ఎంపీ తెలిపారు.
రాజమౌళి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి మరణంతో శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులకు ఎంపీ డా. కడియం కావ్య తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.