8వ వార్డ్ లో తడి -పొడి చెత్త అవగాహన కార్యక్రమం.

తేది :8-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.

జగిత్యాల జిల్లా : గ్రామాల్లో పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 8వ వార్డులో పారిశుధ్య పనులను పర్యవేక్షించి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా బుట్టల్లో వేసి పంచాయతీ ట్రాక్టర్‌కు అందించాలని కోరారు. గ్రామాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామ ప్రథమ పౌరురాలు, సర్పంచ్‌ ఎంబారి గౌతమి-వెంకటేష్‌ను 8వ వార్డు సభ్యుడు అనుమల్ల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం నిరంతరం సేవలందిస్తున్న ఆశ వర్కర్ కవితను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్చార్జి సెక్రెటరీ శ్రీహరి, యోగా శిక్షకుడు శ్రీధర్, కారోబార్ రాజేందర్,మాజీ సింగిల్ విండో చైర్మన్ యాదవనేని రాజలింగం, పొట్టవత్తిని నాగభూషణం, శ్రవణ్ అనుమల్ల మల్లేశం,మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *