తేది:07-03-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా : సన్మానం చేయించుకునే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. సన్మానం చేసే నైతికత స్వార్థపరులైన ద్రోహులకు లేదు. దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఎందుకు సన్మానం చేశారో. చేయించుకున్న రేవంత్ రెడ్డి – చేసిన స్వార్థపరులు
ఇద్దరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.ఎందుకు రేవంత్ రెడ్డికి సన్మానం. ఎస్సీ వర్గీకరణ లేకుండానే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగ నిరుద్యోగుల కడుపు కొట్టినందుకా. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా మాలలు ఒత్తిడి తలొగ్గి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి మాదిగలకు అన్యాయం చేసినందుకా. ఎస్సీ వర్గీకరణలో 11% వాటా రావాల్సిన మాదిగలకు 9 శాతం మాత్రమే కేటాయించి అన్యాయం చేసినందుకా. శాసనసభ ఎన్నికల్లో మాదిగలకు రావాల్సిన ఎమ్మెల్యే టికెట్లను తగ్గించినందుకా. లోక్ సభ స్థానాల్లో ఒక్క టికెట్ కూడా మాదిగల ఇవ్వకుండా జాతి గొంతు కోసినందుకా శాసనమండలి ఖాళీ స్థానాలలో 5 లో ఒకటి కూడా మాదిలకు కేటాయించకుండా రాజకీయ దగా చేసినందుకు రాజ్యసభ సీటు రెడ్డికి ఇచ్చి మాదిగలకు ఇవ్వకుండా మోసం చేసినందుకా. నామినేటెడ్ పదవుల్లో మాదిగల సంఖ్యను తగ్గించి ప్రభుత్వ పాలన నుండి వెలివేసినందుకా. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ వర్గీకరణ ప్రకారం మాదిగ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇవ్వకుండా వారి ఎదుగుదలను అడ్డుకుంటున్నందుకా. కర్ల రాజేష్ మాదిగ లాకప్ డెత్ మౌనంగా ఉన్నందుకా. ఎందుకు సన్మానాలు, ఎందుకు సత్కారాలు.రేవంత్ రెడ్డి తో మాదిగలకు ఒరిగిందేమీ లేదు, జరిగిందేమీ లేదు. నిన్న జరిగిన ముఖ్యమంత్రి సన్మాన సభ చెత్త సభ. ఇలాంటి చెత్త సన్మానాలు చేసుకొని, చెత్త సభల్లో పాల్గొని ముఖ్యమంత్రి తన గౌరవాన్ని, విలువను, పరువును తగ్గించుకోవద్దు.
నిన్న స్వార్ధపరులు చేసిన సన్మాన సభలో పాల్గొని రేవంత్ రెడ్డి మాదిగ జాతికి మరింత దూరం అయ్యాడు .వేం నరేందర్ రెడ్డిని నెత్తి మీద పెట్టుకొని దొమ్మాటి సాంబయ్య మాదిగను అణగద్రోక్కిన రేవంత్ రెడ్డి ఇకనైనా తన వైఖరిలో మార్పు తెచ్చుకొని ఖాళీ అయిన వేం నరేందర్ రెడ్డి యొక్క చీఫ్ అడ్వైజర్ స్థానాన్ని దొమ్మాటి సాంబయ్య తో భర్తీ చేయాలి పోరాటం చేస్తే హక్కులు వస్తాయి.సన్మానాలు చేస్తే పదవులు వస్తాయి. పదవులు వ్యక్తుల స్వార్థం. హక్కులు జాతి సొంతం. కాబట్టి డా.బి. ఆర్ అంబేద్కర్ , డా.బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ జాతికి , మాదిగ ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన హక్కులను పోరాడి సాధించుకుందాం తప్ప పాలకులకు ఊడిగం చేసి, భజన చేసి తెచ్చుకోవాల్సిన కర్మ జాతికి లేదని పిలుపునిస్తున్నాం. అని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)డా.గోవిందు నరేష్ మాదిగ MRPS రాష్ట్ర అధ్యక్షులు.డా.CH సోమశేఖర్ మాదిగ MSF జాతీయఅధ్యక్షులుడా.కొమ్ము శేఖర్ మాదిగ MSF రాష్ట్ర అధికార ప్రతినిధి.