తేది: 6-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: అల్లీపూర్ గ్రామంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పారిశుధ్య కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం గ్రామ పంచాయతీ ఆవరణలో పారిశుధ్య పనులను ప్రారంభించిన అనంతరం, గ్రామ పాలకవర్గం మరియు పంచాయతీ సిబ్బంది కలిసి భారీ ర్యాలీగా పాఠశాల వరకు వెళ్లారు.ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి-వెంకటేష్ గ్రామ ఇన్చార్జి సెక్రెటరీ శ్రీహరి కారోబార్ రాజేందర్, గ్రామపంచాయతీ పాలకవర్గ వార్డ్ మెంబర్లు,వనిత రాధ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్, ఆయుర్వేద వైద్యశాల డాక్టర్, ఫార్మటిస్ట్, పల్లె దావఖాన డాక్టర్, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘ సభ్యులు, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.