అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పారువెల్లి దుర్గ భవానికి నారి కీర్తి అవార్డు 2026.

తేది:05-02-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళి కృష్ణ.

హైదరాబాద్‌: రవీంద్ర భారతి లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సమాజ సేవ, మహిళా సాధికారత రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త డా. పారువెల్లి అంక విజయ దుర్గ భవాని కి “నారి కీర్తి పురస్కారం” అందజేశారు.
ఈ సందర్భంగా పివిపి అంజనీ కుమారి (తెలంగాణ రాష్ట్ర ఉమెన్ చైర్ పర్సన్, విశ్వ సాహితీ కళా వేదిక) ,
కొల్లి రమావతి (అధ్యక్షులు) ల చేతుల మీదుగా దుర్గ భవాని కి సర్టిఫికేట్ మరియు స్మారక చిహ్నం అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సభకు అధ్యక్షతగా డా. సి. నారాయణరెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా కరుపు అంజయ్య , సుబ్బాని శ్రీనివాసులు , కవిత రామమూర్తి పాల్గొని మహిళల సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అమృత వల్లీ (కార్యదర్శి), వినయ్ కుమార్ (కార్యదర్శి)తో పాటు పలువురు ప్రముఖులు, మహిళా నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి ప్రతిభను వెలికితీసే వేదికగా ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *