ప్రపంచ వ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. దీంతో ఆయా దేశాల ఆరోగ్య నిపుణులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆకస్మిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల నొప్పి, అలసట, వికారం, వాంతులు, తీవ్రమైన కండరాల నొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.