గత ప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రాజెక్టులను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాకు సాగునీరు ఇచ్చే ప్రయత్నం చేయలేదని ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు తాను అనుమతులు తీసుకొస్తానని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు