తేది: 02-03-2026 TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా : అల్లీపూర్ గ్రామంలో కాముడు దహనం వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. గత మూడు రోజులుగా గ్రామంలోని చిన్నారులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ప్రతిరోజూ వీధుల్లో కోలలు ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేసిన చిన్నారులు. పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారు.
వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం చిన్నారులందరూ కలిసి తాము ఆడిన కోలలను ఒకచోట చేర్చి సాంప్రదాయబద్ధంగా ‘కాముడు దహనం’ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల కేరింతలతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. మన సంస్కృతిని కాపాడుతూ చిన్నారులు ఇలాంటి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోఎంబారి వెంకటేష్, 8వ వార్డ్ మెంబెర్ అనుమల్ల రాజ్ కుమార్, అనుమల్ల రాజేందర్ నామని లక్ష్మి నర్సయ్య, మోర గణేష్ వార్డ్ మెంబెర్స్, బత్తుల రాజేందర్ (కారోబార్ ) రత్నాకర్, తిరుమల రాజు, మిట్టపెల్లి రవి కిరణ్ దిలీప్,చిన్నారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.