జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మెట్ పెల్లి డివిజన్ నూతన ఆర్డీవో నరసింహరావు.

తేది:02-03-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా: సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మెట్ పెల్లి డివిజన్ ఆర్డీవోగా నూతన బాధ్యతలు స్వీకరించిన జి. నరసింహరావు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని,
ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేయాలని, రెవెన్యూ సంబంధిత సమస్యలను సమయానికి పరిష్కరించాలని, జిల్లా అభివృద్ధికి పరిపాలనా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *