మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు.

తేది:01-03-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన  మాజీ ఎంపీటీసీ రాజిడి అశోక్ రెడ్డి తండ్రి గారైన రాజిడి ఇంద్రసేవరెడ్డి నిన్న అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.అనంతరం వర్ధన్నపేట టౌన్ 1వ వార్డు కి చెందిన నాగెల్లి సురేష్ అనారోగ్యంతో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సాయం అందజేశారు.తదనంతరం 10వ వార్డు కి చెందిన ఇటీవల అనారోగ్యంతో మరణించిన కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.9వ వార్డుకి చెందిన ప్రజా కలం పత్రిక విలేకరి పసునూరి మురళి కుమారునికి ఇటీవల అపెండెక్స్ ఆపరేషన్ కాగా వారి ఇంటికి వెళ్లి అతని పరామర్శించారు.చెన్నారం గ్రామ మాజీ సర్పంచ్ బర్ల బాబు అనారోగ్యంతో బాధ పడుతున్న సందర్భంగా నేడు వారి నివాసానికి వెళ్లి ఆయన ను పరామర్శించారు.వర్ధన్నపేట మండల పరిధిలోని వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు  నాళం సుధాకర్ తాడిచెట్టు పై నుంచి క్రింద పడి కాలు విరగగా వారి నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించి  మనో ధైర్యం కల్పించారు.
ఎమ్మెల్యే వెంట వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్  పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతావత్ శీభారాణి – రాజేందర్,  ఐనవోలు ఆలయ ఛైర్మన్ కమ్మగోని ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజీరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోశాల వెంకన్న, ఈగ దామోదర్, సుధీర్ గౌడ్, సర్పంచులు దుబ్బ అంజయ్య, చిటూరు రాజు, రాజేష్ కన్నా, కుల్ల పావని – యకాంతం వార్డు సభ్యులు సుభాస్, కౌన్సిలర్స్  బెజ్జం పాపరావు, నునావత్ కమిలి – కీమా నాయక్, తిరుపెళ్లి వాణి – కుమారస్వామి, రజిత రెడ్డి, తీగల రాకేష్, లింగారాజు, కొండేటి సాంబయ్య, బాబు లాల్, అక్బర్ స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *