తేది :1-03-2026 TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజిపేట లో మున్నూరుకాపు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు గా బోలిశెట్టి నారాయణ, ఉపాధ్యక్షులు గా కోల శంకర్, కార్యదర్శి గా దశమందం లక్ష్మన్, సహా కార్యదర్శి గా దశమందం వెంకటరెడ్డి లతో పాటు 5 కార్యవర్గ సభ్యులు గా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఎన్నికైన కార్యవర్గాన్ని మున్నూరు కాపు సంఘ సభ్యులు, స్థానిక నాయకులు అభినందించారు.