తేది:01-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండల పరిషత్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు యం.ఏ. మోఖీద్ జన్మదినాన్ని తేది28-02-2026 నాడు పురస్కరించుకుని శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను మోఖీద్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోఖీద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆయన కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమిండ్ల శ్రీనివాస్, నరేష్, అజిత్ తదితరులు పాల్గొని మోఖీద్కు శుభాకాంక్షలు తెలియజేశారు.