తేది:01-03-2026 వికారాబాద్ జిల్లా TSLAW NEWS వికారాబాద్ నియోజక వర్గ రిపోర్టర్ లక్ష్మీనారాయణ.
వికారాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు ఆ పార్టీ చీప్ మల్లికార్జున్ ఖర్గే రేపు అనంతగిరి లోని హరిత రిసార్ట్ కు రానున్నట్లు సమాచారం తెలుగు రాష్ట్రాల డీసీసీల శిక్షణా తరగతుల కార్యక్రమం రేపటితో ముగియనుండటంతో వారి రాక ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేయడం కోసం తీసుకోవాల్సిన ప్రణాళికల గురించి అలాగే ఎంపీటీసీ ,జడ్పిటిసి ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనే సమాచారం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది.