తేది:28-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా మార్చి 01 నుంచి మార్చి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్–1861లోని సెక్షన్ 30 మరియు 30(ఎ) అమలులో ఉంటాయని మెదక్ జిల్లా ఎస్పీ D. V. శ్రీనివాస్ రావు IPS తెలిపారు.
ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నిర్ణీత కాలంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
ప్రజల మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ సంఘాల నాయకులు పోలీసులకు పూర్తి సహకారం అందించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.