ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని Mother Teresa పేర్కొన్నట్లు, గ్రామాల్లోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు బాలవికాస చేపడుతున్న సేవలు అభినందనీయమని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు.

తేది:28-02-2026 హనుమకొండ TSLAWNEWS వడ్డేపల్లి రిపోర్టర్ కందాల శ్రీకాంత్ గౌడ్.

వరంగల్ జిల్లా: కాజీపేట లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, బాలవికాస ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా చెరువుల పూడికతీత, రైతులకు మరియు గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడం వంటి కార్యక్రమాలు సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నాయని చెప్పారు. తాను పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సమయంలో బాలవికాసతో కలిసి అనేక గ్రామాల్లో స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు కృషి చేసిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు.ప్రజల ఆరోగ్యం కాపాడటంలో పరిశుభ్రమైన త్రాగునీటి ప్రాధాన్యత ఎంతో ఉన్నదని, భవిష్యత్తు తరాలకు శుద్ధమైన నీటిని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.అలాగే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తమ స్వగ్రామంలో కూడా బాలవికాస ఆధ్వర్యంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్నామని పేర్కొంటూ, బాలవికాస ప్రతినిధులు మరియు కమిటీ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బాల వికాస ED శౌరెడ్డి, జల వికాస చైర్మన్ లుర్తు కుమార్ రెడ్డి, జల వికాస డైరెక్టర్స్ ప్రతాప్ రెడ్డి, సురేష్ రెడ్డి, బోర్డు మెంబెర్స, మేనేజింగ్ డైరెక్టర్, బాల వికాస సంస్థ సభ్యులు, కార్పొరేటర్లు జక్కుల రవీందర్, రజాలి, మానస, కాంగ్రెస్ నాయకులు కర్ర హరీష్ రెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *